
Harish Rao: గ్రూప్-1 లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు.
Harish Rao slams Congress govt for lapses in Group-1
రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండని… రాహుల్ గాంధీని అశోక్‌నగర్‌లో కూర్చోబెట్టి హామీ ఇచ్చి మోసం చేసిండ్రని ఆగ్రహించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని… సిద్దిపేటలో మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు.. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అన్నారు.
Also Read: Renu Desai: పవన్ కళ్యాణ్ తప్ప నీ లైఫ్ లో వేరే మగాడు ఉండకూడదు.. రేణు దేశాయ్ కి ఫ్యాన్స్ వార్నింగ్.?
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు అని అనుకుంటారు. తప్పులేదు అలా అనుకోవడంలో… కానీ జీవితంలో మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నా అనుభవంతో, 25 సంవత్సరాల ప్రజా జీవితంలో గమనించి చెబుతున్న మాట అని వివరించారు. జీవిత ప్రయాణంలో మొదటి అడుగు పడడమే చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు.. మంచి అని వెయిట్ చేస్తే జీవితంలో లేజీనేస్ పెరిగిపోతుంది…సిద్దిపేట దాటి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తేనే మీకు అనుభవం వస్తుందన్నారు. harish rao
Also Read: Jagan: జగన్ కు గండం మారిన అల్లుడు.. వైయస్ వారసుడిగా రంగంలోకి ?





