
Cinnamon milk: దాల్చిన చెక్క పాలు (Cinnamon Milk) తాగడం ద్వారా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ కె, ఖనిజాలు, అలాగే పాలలో ఉండే కాల్షియం, ప్రోటీన్ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బలపడుతుంది.
Cinnamon milk health benefits daily
నిద్రను మెరుగుపరుస్తుంది: దాల్చిన చెక్కలో ఉండే మెగ్నీషియం ఒత్తిడి తగ్గించడంలో, పాలలోని ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి విశ్రాంతి నిద్రకు సహాయపడుతుంది.
ఎముకలు బలంగా అవుతాయి: పాలలోని కాల్షియం, దాల్చిన చెక్కలోని ఖనిజాలతో ఎముకల సాంద్రత పెరుగుతుంది, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తి: దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. పాలలోని ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. అంతేకాదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బరువు, గుండె ఆరోగ్యం: దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను సరిచేయడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తయారీ విధానం: ఒక గ్లాసు పాలను వేడీ చేయాలి, దానికి అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి కలపాలి. కావాలంటే, తేనె కూడా కలుపుకోవచ్చు. బాగా కలిపి వెడిగా తాగాలి.

