Garlic: పరగడుపున వెల్లుల్లి తింటున్నారా…?

Health Benefits Of Garlic

Garlic: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి చాలా రకాల వంటకాలలో కూరలలో పోపుగా వాడుతూ ఉంటారు. ఇది కూర రుచిని అమాంతం పెంచుతుంది. అంతేకాకుండా సువాసనని వెదజిల్లుతుంది. వెల్లుల్లి కాలి కడుపుతో తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తిన్నట్లయితే విపరీతంగా బరువు తగ్గుతారు. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా అదుపులో ఉంటాయి. వెల్లుల్లిలోని సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుంది ప్రతిరోజు వెల్లుల్లి తిన్న ట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి. వెల్లుల్లి తిన్నట్లయితే శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది.

Also Read: Break Fast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా…అయితే ప్ర‌మాదం తెచ్చుకున్న‌ట్లే?

Health Benefits Of Garlic

రక్త సమస్యలు, రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు వెల్లుల్లిని తిన్నట్లయితే చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు డెలివరీ అనంతరం తప్పకుండా వెల్లుల్లి తినాలి. వెల్లుల్లి తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు అధికంగా బలం చేకూరుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. వెల్లుల్లిని తిన్నట్లయితే జన్మించిన శిశువుకు తల్లి నుంచి సరిపడా పాలు లభిస్తాయి. దానివల్ల కావలసినన్ని పాలను తల్లి జన్మించిన శిశువుకు ఇవ్వగలుగుతుంది. చాలామంది స్త్రీలు డెలివరీ అనంతరం వెల్లుల్లిని అధికంగా తీసుకుంటారు. దానివల్ల వారి శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. బలంగా, యాక్టివ్ గా తయారు అవుతారు. తల్లి పాల ద్వారా వెల్లుల్లిలో ఉండే పోషకాలు జన్మించిన శిశువుకు లభిస్తాయి.

Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?

ఆ కారణంగానే చాలామంది స్త్రీలు వెల్లుల్లిని డెలివరీ అనంతరం అధికంగా తింటారు. ఇక వెల్లుల్లిని చాలా రకాల ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. దీనికి ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకమైన స్థానం కలదు. వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిది. వెల్లుల్లి ఎన్నో రకాల పోషకాలతో నిండి ఉంటుంది. ఆ కారణంగానే దీనికి అధిక శక్తి సామర్థ్యాలు కలవు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా బలాన్ని చేకూరుస్తాయి.

Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో పాటు 100 రోగాలకు…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu