Sankranti 2026: ప్రభాస్ ధాటికి మెగా స్టార్ నిలబడేనా? సంక్రాంతికే రాజా సాబ్!!

Prabhas Raja Saab Confirmed For Sankranti 2026 Release

Sankranti 2026: మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై చివరికి స్పష్టత వచ్చింది. మొదట డిసెంబర్ రిలీజ్‌గా భావించినా, ఇప్పుడు మేకర్స్ 2026 జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Prabhas Raja Saab Confirmed For Sankranti 2026 Release

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన కొత్త లుక్‌ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో, ఈ సంక్రాంతికి రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీని ఎదుర్కోనుంది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పొలిశెట్టి సినిమాలు కూడా అదే సీజన్‌లో రిలీజ్ అవుతున్నాయి.

దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ కథలో హై-లెవెల్ VFX మరియు కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ మిక్స్‌గా ఉంటాయని సమాచారం. నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రేక్షకులు “వింటేజ్ ప్రభాస్” స్టైల్‌ని మళ్లీ ఈ సినిమాలో చూడబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొదట “సమ్మర్ రిలీజ్” అనే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మేకర్స్ బర్త్‌డే పోస్టర్‌తో అన్ని సందేహాలకూ తెరదించారు. 2026 సంక్రాంతి బాక్సాఫీస్‌లో ‘రాజా సాబ్’ రాక ఖాయం. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో భారీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu