Shreyas Iyer: ఐసీయూలో అయ్యర్.. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇంటర్నల్ బ్లీడింగ్!!

Shreyas Iyer: టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయానికి గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ అందుకునే క్రమంలో అయ్యర్ కింద పడి ఎడమ పక్కటెముకలకు గాయపడ్డాడు. వెంటనే బీసీసీఐ వైద్య బృందం స్పందించి ఆయనను సిడ్నీలోని ఓ Hospital ICUకి తరలించింది.

Shreyas Iyer Suffers Internal Bleeding Injury

ప్రాథమిక పరీక్షల్లో ఆయనకు Internal Bleeding (అంతర్గత రక్తస్రావం) ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు వెంటనే ప్రత్యేక చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉన్నారు. ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండేందుకు కనీసం వారం రోజులపాటు సిడ్నీలోనే వైద్యుల కంట్రోల్‌లో ఉంటారని సమాచారం.

ఒక బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ, “శ్రేయస్ మానసికంగా చాలా ధైర్యంగా ఉన్నాడు. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, సమయానికి చికిత్స అందించడంతో ప్రస్తుతం స్థితి నిలకడగా ఉంది” అని తెలిపారు. టీమ్ డాక్టర్, ఫిజియో తక్షణ చర్య తీసుకోవడం వల్ల ప్రమాదం పెరగకుండా నివారించారని ఆయన వివరించారు.

ఇప్పటివరకు ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో, శ్రేయస్ అయ్యర్ రాబోయే T20 Series‌కు ఎంపిక కాలేదు. అభిమానులు సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని శ్రేయస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.