Allu Aravind: తండ్రి చేత తన్నులు తిన్న అల్లు అరవింద్.. పరువు పోతుందని అలాంటి పని.!

Allu Aravind who was kicked by his father

Allu Aravind: అల్లు అరవింద్ నాలుగు పదుల వయసు వచ్చాక కూడా తండ్రి చేత తన్నులు తిన్నారట. 45 ఏళ్ల వయసులో తండ్రి చేత చెంప దెబ్బతిని పరువు పోతుందని అలాంటి పని చేశారట.మరి ఇంతకీ అల్లు అరవింద్ చేసిన తప్పేంటి..ఎందుకు అల్లు రామలింగయ్య కొట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. ది గ్రేట్ కమెడియన్ అల్లు రామలింగయ్య మరణించినప్పటికీ ఆయన సినిమాల్లో చేసిన కామెడీ రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు.

Allu Aravind who was kicked by his father

అయితే అలాంటి అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి నటుడిగా కాకుండా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. అయితే అల్లు అరవింద్ గతంలో తన తండ్రిని తిట్టుకున్న ఒక సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు 45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్న నాతో ఏదో చిన్న గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత నాన్న బయటికి వచ్చారు. (Allu Aravind)

Also Read: Prabhas: ప్రభాస్ కి హీరోయిన్ లవ్ లెటర్.. డైరెక్టర్ సీరియస్.. ఏం జరిగిందంటే.?

ఇక వెంటనే నేను కూడా బయటికి వచ్చి కార్ తీసి నాన్నను కారులో ఎక్కమన్నాను.అలా నాన్న ఎక్కాక కార్ తీయడంతోనే సడన్గా నాన్న తల కి దెబ్బ తగిలింది. వెంటనే మా నాన్న అలానేనా డ్రైవ్ చేసేది అని చెంప మీద నుండి ఒక్కటేసారు.ఆ తర్వాత ఎవరూ చూడలేదు కదా అని కవర్ చేసుకున్నాను. కానీ అప్పటికే నా భార్య చూసింది. ఇక ఈ విషయం తెలియక నేను బయటికి వెళ్లి ఆ తర్వాత ఇంటికి వచ్చాక బెడ్ రూమ్ కి వెళ్ళాను.ఆ సమయంలో నా భార్యకి ఏమీ తెలియదు కావచ్చు అని నేను పోజ్ కొట్టాను.

Allu Aravind who was kicked by his father

కానీ ఆమె మాత్రం ఏంటండీ మామయ్య గారు మిమ్మల్ని అలా కొట్టారు అని అడగడంతో నువ్వు చూసావా. ఎప్పుడు చూసావు.. ఎక్కడ చూసావ్ అని షాక్ లో అడిగాను. ఆ తర్వాత కారులో మిమ్మల్ని కొట్టడం చూసి వెంటనే భయంతో లోపలికి పరిగెత్తుకు వెళ్లాను అంటూ షాక్ ఇచ్చింది. ఇక ఎవరికైతే తెలియకూడదు అని అనుకున్నానో ఆమెకే తెలిసింది. నా పరువు తీశారు కదా నాన్న అని ఆరోజు నాన్నని తిట్టుకున్నాను. కానీ ఆ తర్వాత నాన్న ఆరోజు కొట్టిన దెబ్బ నాకు స్వీట్ మెమోరీగా మారిపోయింది అంటూ అల్లు అరవింద్ ఆలీతో సరదాగా అనే షోలో ఈ విషయాన్ని బయటపెట్టారు.(Allu Aravind)

Share your love