
Shalini: కొంతమంది ఇండస్ట్రీలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు సంపాదిస్తారు.. మరి కొంతమంది ఇండస్ట్రీలో నాశనం కూడా అవుతారు.. అలా ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతంగా ఎదిగిన వారిలో శాలిని కుటుంబం ఒకటి.. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.. ఈవిడే కాకుండా తన సోదరీ షామిలి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటి. అయితే శాలిని కొన్నాళ్ళు ఇండస్ట్రీలో నటించిన తర్వాత తమిళ స్టార్ హీరో అయినటువంటి అజిత్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైపోయింది..
Shalini father used to wash dishes in a hotel
కట్ చేస్తే తాజాగా తమిళ డైరెక్టర్ అలిప్పి అష్రఫ్ శాలిని తండ్రి గురించి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.. ఆయన ఏమన్నారో వివరాలు చూద్దాం.. శాలిని సినిమాల్లోకి రాకముందు ఆమె తండ్రి ఒక హోటల్లో గిన్నెలు కడిగేవాడని, ప్రస్తుతం 100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడని అన్నారు.. ఓసారి శాలిని సినిమా షూటింగ్ కు లేటుగా వచ్చినందుకు ఒక దర్శకుడి చేతిలో తన్నులు కూడా తిన్నాడని ఆయన బయటపెట్టారు.. దీంతో తమిళ మీడియాలో ఈ విషయం గరం గరంగా మారింది. దీనిపై స్పందించిన శాలిని తండ్రి బాబు మీడియాకు అసలు విషయాలు చెప్పారు.. దర్శకుడు అలిప్పి అలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు.. ఆయనకు నాకు ఎలాంటి విరోధం లేదు.. కానీ నా గురించి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు.. (Shalini)
Also Read: Ramya Krishnan: ఆ విషయం నాకు తెలియదు.. బాహుబలి సినిమాపై హీట్ పుట్టిస్తున్న రమ్యకృష్ణ కామెంట్స్.
అసలు నేను ఎప్పుడూ కూడా హోటల్ లో పనిచేయలేదు. గిన్నెలు కడగలేదు.కానీ ఆయన నా గురించి నా అబద్ధం చెప్తున్నాడని మండిపడ్డాడు.. నేను ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక ఫ్యాన్సీ షాపు నడిపే వాడినని చెప్పుకొచ్చారు.. అయితే నాకు 100 కోట్ల ఆస్తి ఉందని ఆయన చెబుతున్నారు, నా ఆస్తి గురించి ఆయనకు ఎలా తెలుసు నాకైతే తెలియదు.. ఆయన మాట ప్రకారం నాకు అంత ఆస్తి ఉంటే మంచిదే కదా అంటూ విమర్శించారు.. అసలు మా ఆవిడ జూనియర్ ఆర్టిస్టు కానే కాదు అసలు ఆమెకి బయట ప్రపంచమే తెలియదు.. ఇక నా కూతుర్లు సినిమాల్లో రాణించినప్పుడు వారిని పట్టుకొని నేనే తిరిగాను..

నా కూతురు శాలిని షూటింగ్ సెట్ కి లేటుగా వచ్చినందుకు దర్శకుడు బోబన్ కొట్టాడని తప్పుగా మాట్లాడారు. ఆయన మమ్మల్ని ఏమీ అనలేదు. లేటు వచ్చినందుకు కాస్త కోప్పడ్డారు.. ఆరోజు షూటింగ్ కి లేటుగా వెళ్లడానికి కారణం నా కూతురు మరో షూటింగ్ ముగించుకొని వచ్చేసరికి లేట్ అయిందని ఆయనతో చెప్పేసరికి ఆయన కూడా అర్ధం చేసుకున్నారు. నన్ను బోబన్ కొట్టాడని కోపంతో నేను చెరువులో దూకానని చెప్పడం అబద్ధం.. అలాంటి పిరికి వ్యక్తిని నేను కాదు.. నాకు చెరువులో దూకాల్సిన పరిస్థితి రాలేదు.ఒకవేళ దూకిన నాకు ఈత వస్తుంది సముద్రంలో దూకినా కూడా బయటకు రాగలిగే శక్తి నాకుంది.. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు నాపై ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని క్లారిటీ ఇచ్చారు.(Shalini)


