Etela Rajender: ఈట‌ల గురువు జ‌పం… కమీషన్ల కోసం కేసీఆర్ క‌క్కుర్తి ప‌డే మ‌నిషి కాదంటూ..?

Etela Rajender positive comments on KCR

Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏ కావాలి, సారే సీఎం కావాలి అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి సమయంలో కెసిఆర్ పార్టీకి ఊపు తెప్పించేలా ఈటల రాజేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. Etela Rajender

Etela Rajender positive comments on KCR

కెసిఆర్ కమిషన్ల కోసం ప్రాజెక్టులు ఎప్పుడు కట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. కమిషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తి పడే వ్యక్తి కాదని ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి అనేది ఇంజనీర్లు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. తప్పు ఉంటే ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలి కానీ మంత్రులు అలాగే ముఖ్యమంత్రిపై చర్యలు అస్సలు తీసుకోవాల్సిన పనిలేదని వివరించారు. అలాంటి హక్కులు ఏ ప్రభుత్వానికి కూడా ఉండబోవు అని భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ బాంబు పేల్చారు.Etela Rajender

Also Read: KK Survey: కాంగ్రెస్ కు వణుకుపుట్టిస్తున్న KK సర్వే… ప్రతి గల్లీలో BRS దే…

కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ సర్కారు పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ పార్టీలోకి త్వరలోనే జంప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని మరికొంతమంది అంటున్నారు. గతంలో గులాబీ పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్, కొన్ని అనివార్య కారణాలవల్ల పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన మళ్లీ గులాబీ పార్టీలోకి వస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అంటున్నారు జనాలు. Etela Rajender

Also Read: Chandrababu Car: చంద్రబాబు కారుపై సరికొత్త చర్చ.. దీని వెనుక ఇంత సీక్రెట్ ఉందా…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu