Rukmini Vasanth: వాళ్లంతా కేటుగాళ్ళు.. రుక్మిణి వసంత్ షాకింగ్ కామెంట్స్.?

Rukmini Vasanth shocking comments

Rukmini Vasanth: కాంతారా ఈ మూవీ పేరు వింటేనే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వస్తాయి. ఈ చిత్రం ప్రతి సినీ అభిమానిని కదిలించింది అని చెప్పవచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అయింది. ఇలాంటి కాంతారా సినిమాకు సీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 మూవీ కూడా వచ్చిందనే సంగతి మన అందరికీ తెలుసు. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి నటనకు అందరూ మంత్రముగ్ధులు అయిపోయారు.

Rukmini Vasanth shocking comments

అయితే ఈ మూవీ తర్వాత రుక్మిణి క్రేజ్ కూడా పెరిగిపోయింది అని చెప్పవచ్చు. అయితే మనకు ఎంత పేరు వస్తుందో నెగెటివిటీ కూడా ఆ విధంగానే వస్తూ ఉంటుంది. కొంతమంది పడని వాళ్లు మనల్ని టార్గెట్ గా చేసి రకరకాలుగా అబద్ధాలు సృష్టించి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఆ విధంగానే రుక్మిణి వసంత్ పేరు చెడగొట్టాలని కొంతమంది ఆకతాయిలు ఆన్లైన్లో ఆమె పేరు వాడుకొని మెసేజ్లు కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్త రుక్మిణి వసంత్ కుమార్ వరకు వెళ్ళింది. (Rukmini Vasanth)

Also Read: Anchor Suma: పెళ్ళైన 25 ఏళ్లకు యాంకర్ సుమ విడాకులు.!

వెంటనే స్పందించిన ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నా పేరు వాడుకొని మెసేజ్లు కాల్స్ పంపమని అడుగుతున్నారని వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది. వాళ్లపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఒక ముఖ్య హెచ్చరిక కూడా పోస్ట్ చేసింది.

Rukmini Vasanth shocking comments

9445893273 అనే నెంబర్తో ఎవరైనా కాల్స్ చేసిన మెసేజ్ చేసిన అస్సలు స్పందించవద్దని, వాళ్లు కేటుగాళ్లని చెప్పుకొచ్చింది. ఈ నెంబర్ కు నాకు సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేరుగా నన్ను లేదంటే మా పిఆర్ టీం ను సంప్రదించాలని కోరింది.. ప్రస్తుతం రుక్మిణి వసంత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..(Rukmini Vasanth)

Share your love