
Sumanth: అక్కినేని సుమంత్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన హీరోగా ఒకప్పుడు యూత్ లో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.కానీ ఆ తర్వాత కథలు ఎంచుకోవడంలో తప్పటడుగులు వేసాడో ఏమో తెలియదు కానీ ఈయన చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవ్వడంతో చివరికి కొద్దిరోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాడు.ఆ తర్వాత పలు సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఈ ఏడాది ఈయన నటించిన అనగనగా అనే మూవీ ఎంతోమంది మనసును ఆకట్టుకుంది.
Sumanth shocking comments on Pawan Kalyan
ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉంది అని రివ్యూ ఇచ్చేశారు.అయితే అలాంటి సుమంత్, కృష్ణ మహేష్ బాబులకు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.ఆయన ఇంట్లో ఏఎన్నార్, నాగార్జున లాంటి దిగ్గజ నటులు ఉన్నప్పటికీ ఆయనకి మాత్రం కృష్ణ, మహేష్ బాబులు అంటేనే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు అప్పట్లో కృష్ణ ఇప్పుడైతే మహేష్ బాబు అని నిక్కచ్చిగా చెప్పేస్తారు.ఇక ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు సినిమా విడుదల అయితే కచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేస్తాను.(Sumanth)
Also Read: Naga Chaitanya: నా భార్య రెండు తలల పాము.. పెళ్లయ్యాక ఫస్ట్ టైం శోభిత నిజ స్వరూపం బయటపెట్టిన…
ఇక నేను అక్కినేని ఇంటి హీరోని అయినప్పటికీ అక్కినేని హీరోల పేర్లు చెప్పను. నాగార్జున పేరు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ నాగార్జున గారిని మహేష్ బాబుని పక్క పక్కన పెట్టినా కూడా నాకు మహేష్ బాబే ఇష్టం అని చెబుతాను. ఇక పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబు ఇద్దరి పేరు చెప్పినా కూడా నేను మహేష్ బాబు అంటేనే ఇష్టమని చెబుతాను. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా అస్సలు లెక్క చేయను.

ఎందుకంటే నాకు మహేష్ బాబు అంటే అంత ఇష్టం. నేను మహేష్ బాబు కి వీరాభిమానిని అంటూ సుమంత్ చెప్పుకొచ్చారు. ఇక అప్పట్లో సుమంత్ చెప్పిన ఈ కామెంట్స్ ఒకింత రచ్చకు దారి తీసినప్పటికీ కొంతమంది మాత్రం ఎవరి అభిప్రాయాలు వారివి..ఒకరికి నచ్చిన వాళ్ళు మరో వ్యక్తికి నచ్చాలని లేదు కదా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి అక్కినేని ఇంటి హీరో అయినప్పటికీ తనకు మహేష్ బాబు అంటే ఇష్టమని సుమంత్ చాలా ధైర్యంగా చెబుతాడు.(Sumanth)





