Uday kiran: సరిగ్గా చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ పై ఉదయ్ కిరణ్ కామెంట్స్.. డైరెక్టర్ చెప్పిన సంచలన నిజం.!

Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. ఈయన మరణం ఇప్పటికీ చాలామందికి మిస్టరీగానే ఉంటుంది. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటికీ ఆ సూసైడ్ కి కారణం ఏంటి అనేది

Uday Kiran comments on Pawan Kalyan exactly 6 days before his death

Uday Kiran: దివంగత నటుడు ఉదయ్ కిరణ్.. ఈయన మరణం ఇప్పటికీ చాలామందికి మిస్టరీగానే ఉంటుంది. ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినప్పటికీ ఆ సూసైడ్ కి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియ రాలేదు. చాలామంది మాత్రం ఆయనకి అవకాశాలు రాక డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోయారు అంటారు. కొంతమంది ఏమో ఆయన భార్య కారణమంటారు.ఇంకొంతమంది మెగా ఫ్యామిలీ కారణమంటారు.కానీ ఇందులో ఏది కరెక్టో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ చనిపోయే ఆరు రోజుల ముందు తనకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడారు అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు.

Uday Kiran comments on Pawan Kalyan exactly 6 days before his death

ఇక విఎన్ ఆదిత్య అంటే ఎవరో కాదు ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా తీసిన డైరెక్టర్.ఈయన ఎన్నో సినిమాలు తీసి స్టార్ దర్శకుడుగా ఇండస్ట్రీలో రాణించారు.అయితే ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ రెండు మూడు సంవత్సరాలకు ఓ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విఎన్ ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చనిపోయే 6 రోజుల ముందు నాకు కాల్ చేశారు. ఆరోజు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా గురించి మాట్లాడుతూ చాలా మెచ్చుకున్నారు. (Uday Kiran)

Also Read: Ram Pothineni: రామ్ పోతినేనిని అల్లు అర్జున్ తొక్కేసారా.. ఫ్యామిలీ సపోర్ట్ తో అలా చేశారా.?

పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ కి ఆ కథ అస్సలు సెట్ అవ్వదు. అది చాలా చిన్న కథ అయినా కూడా ఆయన సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాకరు.ఇలాంటి ఒక కథ మీరు కూడా రాయండి. ఒకవేళ ఎవరైనా చెబితే వినండి. కచ్చితంగా అలాంటి సినిమా చేద్దాం.క్లాస్ సినిమాలు వద్దు ఒక మంచి మాస్ కథ ఉంటే చెప్పండి సినిమా చేద్దాం.అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూసి నేను ఫిదా అయ్యాను అంటూ అత్తారింటికి దారేది సినిమా గురించి ఉదయ్ కిరణ్ నాతో మాట్లాడారు. అలాగే ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమాకి సీక్వెల్ చేద్దాం అని చెప్పినా కూడా నో నో దాన్ని టచ్ చేయొద్దు అని చెప్పారు.

Uday Kiran comments on Pawan Kalyan exactly 6 days before his death

ఇక ఈ మాటలు మాట్లాడిన ఆరు రోజులకే ఉదయ్ కిరణ్ చనిపోయినట్టు నాకు తెలిసింది.ఆయన ఎంతో మంచి ఉన్నతమైన వ్యక్తి.అలాంటి ఉదయ్ కిరణ్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు వీఎన్ ఆదిత్య.అయితే చాలా రోజుల నుండి మెగా ఫ్యామిలీ వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయారు అనే వార్తలకు విఎన్ ఆదిత్య పుల్ స్టాప్ పెట్టినట్టే. ఎందుకంటే ఉదయ్ కిరణ్ కి మెగా ఫ్యామిలీ పై కోపం ఉంటే చనిపోయే 6 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా ఎందుకు మాట్లాడతారు అంటూ మాట్లాడుకుంటున్నారు.(Uday Kiran)