Pawan Kalyan: ఓజి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ధరించిన దాని గురించే ఇప్పుడు హాట్ టాపిక్.. ఏంటంటే.?

What Pawan Kalyan wore at the OG event

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది.ఇక ఒక రోజు ముందే నుండి అంటే అర్ధరాత్రి ప్రీమియర్ షోలు కూడా పడబోతున్నాయి.అలాగే ఈ సినిమాకి ముందు నుండే భారీ హైప్ ఉంది.ఇక ఆ అంచనాలకు తగ్గట్టే సినిమాను కూడా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

What Pawan Kalyan wore at the OG event

రీసెంట్ గా విడుదలైన ఓజి ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా అదరగొట్టేశారు. ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుందో అని చాలామంది ట్రైలర్ చూసి కామెంట్లు పెడుతున్నారు.అయితే ఈ విషయం పక్కనపడితే పవన్ కళ్యాణ్ ఓజి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధరించిన దాని గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. (Pawan Kalyan)

Also Read:Soundarya: తెల్లారితే హీరోయిన్ పెళ్లి.. ఇంతలో సౌందర్య చావు..!

మరి ఇంతకీ ఓజీ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ధరించినది ఏంటి అనేది చూస్తే.. జంధ్యం.. పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారు.ఆ షర్ట్ లో నుండి ఆయన వేసుకున్న బంగారు జంధ్యం కనిపిస్తుంది.మరి పవన్ కళ్యాణ్ ఓజి సినిమా లుక్ లో అలా కనిపించారా.. లేక ముందు నుండే అలా జంధ్యం వేసుకుంటున్నారా అనేది తెలియదు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

What Pawan Kalyan wore at the OG event

కొంతమంది ఏమో ఓజీ మూవీ గెటప్ లో భాగంగానే ఆయన జంధ్యం ధరించారు అంటే మరి కొంతమందేమో కాదు కాదు ఏదైనా సెంటిమెంట్ కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ జంధ్యం అంత స్పష్టంగా కనిపించడం లేదు కానీ పవన్ కళ్యాణ్ ఫోటోని జూమ్ చేసి చూస్తే మాత్రం కనిపిస్తోంది.(Pawan Kalyan)

Share your love