RGV: బాలకృష్ణ సినిమాలు చూడను.. ఆర్జీవిపై నందమూరి ఫ్యాన్స్ ఫైర్..!

Nandamuri fans fire on RGV

RGV: ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీని వేరే లెవల్ కి తీసుకు వెళ్లిన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు.. ఈయన తన సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు.అలాంటి రామ్ గోపాల్ వర్మ తీసిన శివ మూవీ రీసెంట్ గా నవంబర్ 14న రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ శివ మూవీ 4కె రిజల్యూషన్ తో రిలీజ్ అవ్వడంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు.

Nandamuri fans fire on RGV

అయితే ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ రాంగోపాల్ వర్మని బాలకృష్ణ సినిమాల గురించి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చారు. ఆర్జీవి మాట్లాడుతూ.. అసలు నేను 30 ఏళ్ల క్రితం బాలకృష్ణ సినిమాలు చూశాను. కానీ ఇప్పట్లో ఆయన సినిమాలు చూడలేదు.గత కొన్ని సంవత్సరాల నుండి ఆయన చేసిన సినిమాలు నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఆయన సినిమాలు నాకు చూడబుద్ధి కాదు. (RGV)

Also Read: Balakrishna: వీడు సాయంత్రం నాకు కనబడద్దు.. ఎవడు రమ్మన్నాడంటూ బాలకృష్ణ ఫైర్..!

బాలకృష్ణ సినిమాలు చూడడం నా సెన్సిబిలిటీలో లేదు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఆన్సర్ పై చాలా మంది నందమూరి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ అంటే ఎంతటి పేరు గౌరవం ఉందో చెప్పనక్కర్లేదు.అలాంటి బాలకృష్ణ సినిమాలు చూడడం లేదని ఆయనని అవమానిస్తావా.. గతంలో నీ సినిమాకు ఆయన ఒప్పుకోకపోవడం వల్లే నువ్వు ఆ కోపంతో ఈ వ్యాఖ్యలు చేశావా..

Nandamuri fans fire on RGV

లేకపోతే నువ్వు వైసిపి వాడివి కాబట్టి టిడిపి పార్టీకి చెందిన బాలకృష్ణని ఈ విధంగా అవమానించారా అంటూ మండిపడుతున్నారు. ఇక మరికొంత మందేమో ఎవరి అభిప్రాయం వారిది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు. అలాగే ఆర్జీవి బాలకృష్ణ సినిమాలు చూడడం చూడకపోవడం అనేది పూర్తిగా ఆయన ఇష్టమే. దీనిలో తప్పు పట్టడానికి ఏమీ లేదు అంటూ మద్ధతు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ సినిమాలు చూడడం లేదని చెప్పి ఆర్జీవి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నారు.(RGV)

Share your love