Ranbir Kapoor-Alia Bhatt: విడాకులు తీసుకోబోతున్న రణబీర్ కపూర్ ఆలియా భట్..!

Ranbir Kapoor-Alia Bhatt are going to get divorced

Ranbir Kapoor-Alia Bhatt: ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడిపోతుండడంతో మిగతా సెలబ్రిటీలు దూర దూరంగా ఉన్నట్టు ఏ చిన్న అనుమానం వచ్చిన సరే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ మీడియాలో తాజాగా రణబీర్ కపూర్ అలియా భట్ లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.దానికి ప్రధాన కారణం కూడా ఉంది.

Ranbir Kapoor-Alia Bhatt are going to get divorced

అదేంటంటే తాజాగా నెట్ఫ్లిక్స్ లో కపూర్ ఫ్యామిలీకి సంబంధించి డైనింగ్ విత్ ది కపూర్స్ అనే ఒక షో స్టార్ట్ అయింది.అయితే ఈ షో నెట్ఫ్లిక్స్ లో 21 అనగా నిన్నటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ షో కి సంబంధించిన వీడియోలలో అలియా భట్ ఎక్కడా కూడా కనిపించలేదు. కపూర్ ఫ్యామిలీ మొత్తం కనిపించినా అలియా భట్ కనిపించకపోవడంతో భర్తతో విభేదాల వల్లే ఆలియా ఆ షోకు రావడానికి ఇష్టపడలేదనే వార్త ఊపందుకుంది.(Ranbir Kapoor-Alia Bhatt)

Also Read: Kushboo: రజినీకాంత్ తో ఐటెం సాంగ్.. చెప్పుతో కొడతానంటూ కుష్బూ ఫైర్.!

డైనింగ్ విత్ ది కపూర్స్ షోకి అర్మాన్ జైన్ హోస్టుగా వ్యవహరించగా.. రణబీర్ కపూర్, ఆయన తల్లి,కరీనాకపూర్,సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్ ఇలా ఎంతోమంది కపూర్ ఫ్యామిలీ లోని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే తాజాగా కొత్త అనుమానాలకు తెరలేసింది. అలియా భట్ ఈ షో కి రాకపోవడానికి ప్రధాన కారణం భర్తతో ఉన్న విభేదాలే అనే పాయింట్ ఎక్కువ వైరల్ అవ్వడంతో చాలామంది వీరి విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు.

Ranbir Kapoor-Alia Bhatt are going to get divorced

ఈ నేపథ్యంలోనే ఈ షో కి హోస్టుగా చేసిన అర్మాన్ జైన్ విడాకులపై క్లారిటీ ఇస్తూ అలియా భట్ షో కి రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే. మీరు అనుకుంటున్నట్లు వేరే ఏ కారణాలు కాదు. సినిమా వల్లే ఈ షోకి రాలేకపోయింది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక అర్మాన్ జైన్ క్లారిటీతో రన్బీర్ కపూర్ అలియా భట్ అభిమానులు హమ్మయ్య మేమింకా విడాకులు తీసుకుంటున్నారు కావచ్చు అని భయపడిపోయాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Ranbir Kapoor-Alia Bhatt)

Share your love