Shivaji Raja: పెళ్లయ్యాక ఆ నటికి లవ్ లెటర్ రాసిన శివాజీ రాజా.. భార్యకి చూపించి.!

Shivaji Raja wrote a love letter to the actress after marriage

Shivaji Raja: నటుడు శివాజీ రాజా అంటే తెలియని వారు ఉండరు.ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోలకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో అలరించిన ఈయన ప్రస్తుతం తండ్రి,మామ వంటి పాత్రలు పోషిస్తున్నారు.అయితే అలాంటి శివాజీ రాజా తాజాగా వచ్చి హిట్ కొట్టిన రాజు వెడ్స్ రాంబాయి మూవీ లో హీరో తండ్రి పాత్ర పోషించారు.అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు శివాజీ రాజా.

Shivaji Raja wrote a love letter to the actress after marriage

ఆయన మాట్లాడుతూ.. మురారి సినిమా షూటింగ్ సమయంలో ఖాళీగా కూర్చొని ఉన్న నన్ను చూసిన కృష్ణవంశీ గారు ఓ లవ్ లెటర్ రాయు..రాసి నటి అనిత చౌదరికి ఇవ్వమని చెప్పారు. అనిత చౌదరి సినిమాల పట్ల చాలా డెడికేటెడ్ గా ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ సెట్ కి వస్తుంది. అలా అనితా చౌదరి రావడంతోనే కృష్ణ వంశీ ఖాళీగా కూర్చోకు అనితకి ఓ లవ్ లెటర్ రాసి ఇవ్వమన్నాడు.(Shivaji Raja)

Also Read: Kushboo: ‘నీ మొహం కడుక్కో పో’ అంటూ కుష్బూని అవమానించిన కమల్ హాసన్.!

అలా నేను అనితకి లవ్ లెటర్ గోదావరి స్లాంగ్లో రాసి ఇచ్చాను.అయితే ఆ లవ్ లెటర్ కేవలం అనిత చౌదరి మాత్రమే చదువుతుంది అనుకుంటే షూటింగ్ సెట్ లో ఉన్న వారందరికీ వినిపించింది. అంతేకాదు ఓసారి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను చూడడానికని వచ్చి నా భార్య కూడా నేను రాసిన లవ్ లెటర్ చూపించింది.

Shivaji Raja wrote a love letter to the actress after marriage

ఆ సందర్భం ఎప్పుడు గుర్తొచ్చినా సరే భలే సరదాగా అనిపిస్తుంది అంటూ ఆ ఈవెంట్లో శివాజీ రాజా అప్పటి విషయాన్ని చెప్పుకొని అందర్ని నవ్వించారు. ఇక రాజు వెడ్స్ రాంబాయి మూవీ లో కూడా శివాజీ రాజా అనిత చౌదరి ఇద్దరు భార్య భర్తలుగా నటించారు.ఈ సినిమాలోనే కాదు చాలా సినిమాల్లో వీరిద్దరూ భార్యాభర్తలుగా చేశారు. అలా వీరి మధ్య ఉన్న సాహిత్యం తోనే కృష్ణవంశీ ఆరోజు అలా చెప్పారట.(Shivaji Raja)

Share your love