Ram Pothineni: రామ్ పోతినేనిని అల్లు అర్జున్ తొక్కేసారా.. ఫ్యామిలీ సపోర్ట్ తో అలా చేశారా.?

Did Allu Arjun trample on Ram Pothineni
Did Allu Arjun trample on Ram Pothineni

Ram Pothineni: దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని ఆ తర్వాత వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.అయితే అలాంటి ఈయన చాలా సంవత్సరాల నుండి టైర్ 1 హీరోగా పేరు తెచ్చుకోవాలని ఎంత కష్టపడుతున్నప్పటికీ 2,3 హిట్స్ తర్వాత ఓ ప్లాఫ్ వచ్చి ఆయన్ని టైర్ 1 హీరోకి ఆమడ దూరంలో పెడుతుంది. అయితే అలాంటి రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Did Allu Arjun trample on Ram Pothineni

నవంబర్ 27న ఈ సినిమా విడుదలైంది.ఇప్పటికే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రామ్ పోతినేని ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో మాట్లాడిన ఒక మాట మాత్రం మీడియాలో తీవ్రదుమారానికి తెరలేపింది. మరి ఇంతకీ రామ్ పోతినేని చేసిన కామెంట్లు ఏంటి అనేది చూస్తే..రామ్ పోతినేని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మొదట నాకు ఓ ట్యాగ్ ఉండేది.కానీ ఆ ట్యాగ్ ని మరో హీరో తీసుకున్నారు అంటూ చెప్పారు. (Ram Pothineni)

Also Read: Andrea: బట్టలు లేకుండానే షూట్.. ఆయన వల్లే ఇదంతా.. పిశాచి-2 పై ఆండ్రియా కామెంట్స్.!

అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రామ్ పోతినేనికి తన అభిమానులు ఒక ట్యాగ్ ఇచ్చారట. కానీ ఆ ట్యాగ్ కొద్ది రోజులకి మరో హీరో పేరు ముందు కనిపించడంతో రామ్ పోతినేని తన ట్యాగ్ ని పక్కన పెట్టారట. అయితే రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్,చాక్లెట్ బాయ్ అంటూ పిలుస్తూ ఉంటారు. కానీ మొదట్లో ఆయన్ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారట. అయితే అదే ట్యాగ్ అల్లు అర్జున్ కి కూడా ఉంది.ప్రస్తుతం అల్లు అర్జున్ ఐకాన్ అయినప్పటికీ ఒకప్పుడు మాత్రం స్టైలిష్ స్టార్..

Did Allu Arjun trample on Ram Pothineni

అలా రామ్ పోతినేని తన ట్యాగ్ గురించి స్పందించడంతో చాలామంది నెటిజన్లు రామ్ పోతినేని ని అల్లు అర్జున్ తొక్కేసారని,ఆయన ట్యాగ్ని లాగేసుకొని ఆయన పేరు ముందు తగిలించుకున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు మాత్రం స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ రామ్ పోతినేని కంటే ముందే అల్లు అర్జున్ కి ఉంది అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో స్టైల్ స్టార్ వేరే స్టైలిష్ స్టార్ వేరే అంటూ ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు పెడుతూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ రామ్ పోతినేని ఫ్యాన్స్ వార్ కొనసాగుతోంది..(Ram Pothineni)

Leave a Comment