
Tollywood: ఈ మధ్యకాలంలో ఏఐ అందుబాటులోకి వచ్చాక ఎన్నో మ్యాజిక్కులు చూస్తున్నాం. ముఖ్యంగా ఏఐ ని మంచి దారిలో వినియోగించుకోవడం కంటే చెడు దారిలోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఏఐ ద్వారా ఎన్నెన్నో ఘోరాలు చూస్తున్నాం.ఇదిలా ఉంటే ఏఐ అనేది ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తుంది. అయితే తాజాగా టాలీవుడ్ లో ఉన్న టాప్ 1 హీరో ఎవరు? ఆయన తర్వాత ఎవరెవరు ఉన్నారు అని ప్రశ్నించగా..అందరూ ఆశ్చర్యపోయే ఆన్సర్ ఇచ్చింది.ఇక ఈ ఆన్సర్ చూసిన ఆ హీరో అభిమానులైతే తెగ సంబరపడిపోతున్నారు. మరి ఏఐ ప్రకారం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
AI has determined that he is Tollywood number 1 hero
ఏఐ చాట్ బోట్ లు అయినటువంటి చాట్ జిపిటి,జెమిని, గ్రోక్ లని టాలీవుడ్ నెంబర వన్ హీరో ఎవరు అని ప్రశ్నించగా..ఈ మూడింట్లో కూడా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏఐ చాట్ జిపిటిలో టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అని అడగగా.. మొట్టమొదటి పేరు ప్రభాస్ అని చెప్పింది. ప్రభాస్ తర్వాత మహేష్ బాబు,అల్లు అర్జున్, ఎన్టీఆర్,రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ల పేర్లు చెప్పింది. (Tollywood)
Also Read: Rakul Preet Singh: ఆ హీరో వల్లే టాలీవుడ్ కి దూరం.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్.!
అలాగే జెమినీలో టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అని ప్రశ్నించగా.. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబుల పేర్లు తెలిపింది. ఇక గ్రోక్ లో టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అని ప్రశ్నించగా..ప్రభాస్, అల్లు అర్జున్,మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ అంటూ టాప్ 6 హీరోల పేర్లు చెప్పాయి.

అలా ఈ మూడు కూడా ఏకాభిప్రాయంగా టాలీవుడ్ టాప్ స్టార్ నెంబర్ వన్ స్టార్ ప్రభాస్ అనిఆయన పేరును చెప్పడంతో ప్రభాస్ అభిమానులంతా సోషల్ మీడియాలో కూడా మా బాహుబలి రికార్డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ నెంబర్ 1 హీరో స్థానం ప్రభాస్ కి దక్కడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు.(Tollywood)





