Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?

Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా? అంటూ కొత్త వాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది బీఆర్ ఎస్ పార్టీ. హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. గచ్చిబౌలిలోని యుఎస్ కాన్సులేట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టబోతున్నారు. Donald Trump

Harish Rao slams revanth reddy Donald Trump

ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు పెట్ట‌నున్నారు. గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో కొన్ని రహదారులు ఉండ‌నున్నాయి. హైదరాబాద్ లోని పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నార‌ట‌. అయితే, దీనిపై బీఆర్ ఎస్ పార్టీ మాజీ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీష్ రావు స్పందించారు. ట్రంప్ ఏం చేశాడని రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని నిప్పులు చెరిగారు హ‌రీష్ రావు. Donald Trump

Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?

మన తెలుగు పిల్లలకు బేడీలేసి జైళ్లలో పెట్టినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా? అంటూ నిల‌దీశారు. ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా? అంటూ ఓ రేంజ్ లో ఆగ్ర‌హించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. డిసెంబర్ 23వ తేదీన తెలంగాణ విద్రోహ దినోత్సవంగా మనం జరుపుకోవాలని పిలుపునిచ్చారు హ‌రీష్ రావు. ఇచ్చిన తెలంగాణను సోనియమ్మ వెనక్కు తీసుకుందనే చర్చను ప్రజల్లో పెట్టాలన్నారు హరీశ్ రావు. Donald Trump

Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?

Share your love