
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం తప్పిందట. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో టైర్ పగిలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. CM Revanth Reddy
A burst tire a near miss for CM Revanth Reddy convoy
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 17 వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ చాలా వేగంగా వెళుతుందట. ఈ సమయంలో రన్నింగ్ లోనే కాన్వాయ్ జామర్ టైర్ డమాల్ అయిందంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాకచక్యంగా ఆ వాహనాన్ని కంట్రోల్ చేశాడట సదరు డ్రైవర్. ఇక వెంటనే ఆ టైరు కూడా మార్చేసింది ట్రాఫిక్ పోలీస్ బృందం. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. CM Revanth Reddy
Also Read: Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?
దీంతో అందరూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ సంఘటన ఈ కాస్త ఆలస్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న బయటకు వార్త రాలేదని ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. CM Revanth Reddy
Also Read: TDP: బందర్ కూటమి నేతల పంచాయితీ.. ఎన్టీఆర్ విగ్రహం పట్టుకుని రచ్చ ?





