
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్న నేపథ్యంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు కొడాలి నాని. ఇక యుద్ధం మొదలవుతుందని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మరోసారి ముఖ్యమంత్రి చేస్తానని కొడాలి నాని తాజాగా వెల్లడించారు. దాదాపు ఆరు నెలల నుంచి కొడాలి నాని బయట కనిపించడం లేదన్న సంగతి తెలిసిందే. Kodali Nani
Kodali Nani political comments on his re entry jagan
ఆరు నెలల కిందట ముంబైలో గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు కొడాలి నాని. అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరమైన ఆయన, రాజకీయాలకు గుడ్ బై చెబుతారని కూడా కొంతమంది ప్రచారం చేశారు. ఇలాంటి నేపథ్యంలో మీడియా ముందుకు తాజాగా కొడాలి నాని వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా కొడాలి నాని పాల్గొని మాట్లాడారు.
Also Read: DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణను అవమానించిన డీకే శివకుమార్ ?
Kodali Naniరాజకీయంగా మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతానన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. బైపాస్ సర్జరీ కారణంగా ఆరు నెలలపాటు రెస్టు తీసుకున్నానని చెప్పారు. మరో 6 నెలల సమయంలో ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు కొడాలి నాని. కూటమి వైఫల్యాలను ఎప్పటిలాగే ఎండగాడుతూ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే వరకు నిద్రపోనని వెల్లడించారు. ఏపీలో వైసిపి ప్రభుత్వం త్వరలోనే రాబోతుందని కూడా వెల్లడించారు. గుడివాడలో కూడా వైసీపీ జెండా ఎగరవేస్తానని కూటమికి హెచ్చరికలు జారీ చేశారు. Kodali Nani
Also Read: KCR: కల్వకుంట్ల కవితపై కుక్క అంటూ కామెంట్స్..కేసీఆర్ భార్య ఆగ్రహం ?





