Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?

Sravani Chowdary
Sravani Chowdary

Sravani Chowdary: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావడంతో జనాలు థియేటర్కు వెళ్లి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బాలయ్య సినిమాపై రకరకాల ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి. Sravani Chowdary

ycp trolls on Sravani Chowdary over akhanda 2

ఈ సినిమా చూస్తే తలనొప్పిగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, బలవంతంగా ఈ సినిమాను జనాలపైకి బోయపాటి శ్రీను రుద్దినట్లు ఉందని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అయితే టిడిపికి సపోర్ట్ గా మాట్లాడే యూట్యూబ్ శ్రావణి చౌదరి చేసిన కామెంట్లను కూడా వైసిపి ట్రోల్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మూడు కోట్ల టికెట్లు హైదరాబాదులోనే సేల్ అయినట్లు శ్రావణి చౌదరి సంచల వ్యాఖ్యలు చేశారు. దానికి వైసిపి మొదటి రోజు కౌంటర్ వచ్చింది. హైదరాబాదులో జనాభా ఉంది కోటిన్నర మాత్రమే, నువ్వు మాత్రం మూడు కోట్ల మంది టికెట్లు చించేశారని అరిచావ్ అంటూ ర్యాగింగ్ చేశారు. Sravani Chowdary

Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవ‌మానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?

ఇక నిన్నటి రోజున మొదటి రోజు కలెక్షన్లపై ఓ వీడియో పెట్టింది శ్రావణి చౌదరి. ఆ సందర్భంగా ఒకేరోజు 200 కోట్లు రావడం గ్యారెంటీ అంటూ కామెంట్ చేసింది. కానీ 59.5 కోట్లు మాత్రమే మొదటి రోజు కలెక్షన్స్ అంటూ స్వయంగా చిత్ర బృందం ప్రకటన చేసింది. దీంతో మళ్లీ శ్రావణి చౌదరిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు వైసిపి శ్రేణులు. ఏది పడితే అది ఎల్లో మీడియా వాగేస్తోందని, అట్టర్ ఫ్లాప్ సినిమాను హిట్ సినిమా అంటూ వీడియోలు పెట్టడం దారుణం అంటూ సెటైర్లు పేల్చుతోంది. Sravani Chowdary

Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీల‌లు…ఫోటో వైర‌ల్ ?

Share your love