
Akhanda 2: ‘అఖండ 2 తాండవం’తో మరోసారి Balakrishna తన మాస్ పవర్‌ను చూపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే Pan India levelలో భారీ అంచనాలు సృష్టించింది. ‘డాకు మహారాజ్’ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాలయ్య కెరీర్లో అత్యంత పవర్ఫుల్ రోల్ అని ఇండస్ట్రీ టాక్.
Balakrishna returns powerful in Akhanda 2
మొదటి భాగం ‘అఖండ’లో అఘోరి పాత్రతో బాలయ్య క్రేజ్ కొత్త స్థాయికి చేరింది. ఇప్పుడు ‘అఖండ 2’లో ఆయన dual roleలో కనిపించనున్నారు. ఒక వైపు అఘోరి రూపం, మరో వైపు హిందూపురం ఎమ్మెల్యే మురళీ కృష్ణ పాత్రలో కనిపిస్తారని వార్తలు. ఈ లుక్‌ను చూడటానికి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా, ప్రగ్యా జైశ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ మళ్లీ బోయపాటి–బాలయ్య కాంబినేషన్‌కి మాస్ బీట్ అందిస్తున్నాడు. అఖండలోలాగే ఈ సారి కూడా background score సినిమాకి ప్రాణమని టాక్ వినిపిస్తోంది.
‘అఖండ 2 తాండవం’ డిసెంబర్లో విడుదల కానుంది. బోయపాటి శ్రీను స్క్రీన్‌ప్లేలో యాక్షన్, ఎమోషన్, devotional elementsను సమపాళ్లలో మిళితం చేశాడు. పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిజంగా “తాండవం” చేయనుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





