
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లు అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై ఓ సర్వే షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతే కూటమి ప్రభుత్వం దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని తేలింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం గ్యారెంటీ అంటూ పరోక్షంగా సదరు సర్వే సంస్థ రిపోర్టు బయట పెట్టింది. Chandrababu Naidu
Chandrababu Naidu IITians Group Latest Survey Report On Andhra Pradesh
ఆ సర్వే ఏదో కాదు IITians. ఇద్దరు పారిశ్రామిక వేత్తలు డబ్బులు పెట్టి ఈ IITians సర్వే సంస్థ ద్వారా ఏపీలో సర్వే చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, అమరావతి, పవన్ కళ్యాణ్ పనితీరు, పెన్షన్ల పంపిణీ, మధ్యతరగతి జీవితాలు ఇలా అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల నాడిని రాబట్టేందుకు ఈ సర్వే చేయించారట. అయితే ఈ సర్వేలో చాలా మంది ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసినట్లు తేలిందట. Chandrababu Naidu
Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?
అంతేకాదు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి కేవలం 31 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే వెల్లడించిందట. అంటే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారెంట అని తెలిపింది. ఇప్పుడు ఈ సర్వే సంస్థ విడుదల చేసిన రిపోర్టును వైసిపి బాగా వాడుకుంటోంది. కూటమిని ర్యాగింగ్ చేస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పని అయిపోయిందని సెటైర్లు పేల్చుతోంది వైసిపి. మరి దీనిపై ఇప్పటి వరకు కూటమి నుంచి ఏ పార్టీ నేత కూడా స్పందించలేదు. Chandrababu Naidu
Also Read: Akhanda 2: వైసీపీ రెక్కలు విరిచేసిన బాలయ్య..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?





