

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. 2024 లో అధికారంలోకి వచ్చిన కూటమిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అంది వచ్చిన అవకాశాన్ని వైసిపి క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం పైన కన్నేసింది వైసిపి. Jagan
Jagan bumper offer to Pithapuram Varma
అక్కడ అసంతృప్తిగా ఉన్న కూటమి నేత పిఠాపురం వర్మాను టార్గెట్ చేసింది జగన్ సేన. వైసీపీలోకి రావాలని అతన్ని ఆహ్వానించిందట. అతని ద్వారానే పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టాలని జగన్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున టికెట్ ఇస్తామని జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారట. Jagan
Also Read: BRS VS Congress: ఆసుపత్రికి వచ్చిన మహిళలపై అత్యాచారం..ఆ రాజకీయ నేత భాగోతం ఇదే…
పవన్ కళ్యాణ్ ఓడిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని కూడా ఆఫర్ చేశారట జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కంటే వర్మకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. టిడిపిలో ఉన్న చాలామంది నేతలు వర్మకు సపోర్ట్ చేస్తున్నారు. అతనికి అన్యాయం జరిగిందని చంద్రబాబుపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మరి వర్మ ఈ ఆఫర్ ఓకే చెపుతారా ? లేదా ? అనేది చూడాలి. Jagan
Also Read: TDP: టీడీపీ ఎంపీకే ఫోన్ చేసి, కమీషన్ అడిగిన సొంత పార్టీ ఎమ్మెల్యే ?







