

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. క్రైస్తవులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సోనియాగాంధీ త్యాగం వల్ల ఇవాళ మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నామని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై భారతీయ జనతా పార్టీతో పాటు గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవ పండుగ అయిన క్రిస్మస్కు అలాగే సోనియాగాంధీకి ఏం సంబంధం అని నిలదీస్తున్నారు. CM Revanth Reddy
CM Revanth Reddy controversial comments on Christians
హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోనియా గాంధీ త్యాగం వల్ల క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామని.. ఆమె పుట్టిన నెలలోనే క్రిస్మస్ కూడా వచ్చిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రైస్తవులకు ఒక వ్యక్తికి సంబంధం ఏంటి అని నిలదీస్తున్నారు. CM Revanth Reddy
Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్
సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవులను అవమానిస్తూ మాట్లాడాడని, వెంటనే వాళ్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు బిజెపి నేతలు. అటు ఇటీవల హిందువులను కూడా కించపరుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి కాని వాళ్లకు ఒక దేవుడు, తాగేటోడికి మరొక దేవుడు, పెళ్లి చేసుకున్నోడికి మరో దేవుడు అంటూ హిందువుల దేవుళ్లపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వివాదం మరవక ముందే ఇప్పుడు క్రైస్తవులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. CM Revanth Reddy
Also Read: Jagan-KCR: పెను సంచలనం..తాడేపల్లి నివాసం వద్ద జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్







