
CM REVANTH REDDY : దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధామంత్రిని చేయడమే లక్ష్యమని తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ లోని హరిత రిసార్ట్ వేదికగా డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహించారు. సీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. CM REVANTH REDDY
CM REVANTH REDDY SENSATIONAL COMMENTS ON RAHUL GANDHI’S PRIME MINISTERSHIP
ప్రజా జీవితంలో తానెప్పుడూ పైరవీలు చేయలేదన్నారు. గతంలో ప్రజా సమస్యలపై గళం విప్పిన తన పై కేసులు నమోదు చేసారని గుర్తు చేశారు. ఆదివారం తాను కోర్టుకు వెళ్లి వచ్చానని తెలిపారు. ఈ 19 సంవత్సరాల రాజకీయంలో జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అన్ని పదవులను చూశానని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవులు సైతం నిర్వహించానని చెప్పారు. ఎమ్మెల్యే గా తాను మంచి అనుభవం సంపాదించానని వివరించారు. తనపై కేసులు పెట్టారని.. పరువు నష్టం దావాలు కూడా వేశారని వెల్లడించారు. CM REVANTH REDDY
Also Read : TELANGANA : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. సరికొత్త విప్లవానికి రేవంత్ సర్కార్ శ్రీకారం
సోనియాగాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఐదు సంవత్సరాలు చేసిన పోరాటల వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా అయ్యారని పేర్కొన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, దేశంలో అనేక సమస్య లపై పోరాటం చేశారని.. సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలను గుర్తు చేశారు. తనపై అనేక కేసులు పెట్టారని.. పరువు నష్టం దావాలు వేశారని, దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పేర్కొన్నారు. సోనియాగాంధీ పేరుతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని తెలిపారు. CM REVANTH REDDY
Also Read : BALKA SUMAN : బాల్క సుమన్ కి బెయిల్.. కానీ ఆ షరతులు పాటించాల్సిందే..!





