Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

Bathukamma a pageant of Telangana tradition

Bathukamma: తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అశ్వయుజ మాసంలో పూలతో అలంకరించిన బతుకమ్మను మహిళలు పూజించి పాటలు పాడుతూ బతుకమ్మను ఆడుతారు. ఈ పండుగ మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఇక తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. పువ్వులతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను చేసి స్త్రీలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటారు. ఇక బతుకమ్మ పండుగ యొక్క తొమ్మిది రోజుల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

Bathukamma a pageant of Telangana tradition

మొదటి రోజు పూలతో బతుకమ్మను అలంకరించి పండుగను జరుపుకుంటారు. అమ్మవారికి పెసరపప్పు, చెక్కరి నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటారు. ఈరోజున అటుకులు, చెక్కరితో ముద్దలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మను తయారు చేస్తారు. నువ్వులు, ముద్దపప్పు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజు నానబోయిన బతుకమ్మను జరుపుకుంటారు. పప్పులు, వేరుశనగలు, కందులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మను అలంకరించి పండుగను జరుపుకుంటారు.

Also Read: Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

బియ్యం పిండితో చేసిన అట్లను బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ పండుగను చేసుకుంటారు. పప్పు కూరలు, ఆకుకూరలు ముద్దపప్పు అన్నంని నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడవ రోజు వేపాకు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. వేప ఆకులు, ఇతర ఔషధ మొక్కలతో బతుకమ్మను అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి మక్క గారెలు, మక్కగుడాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు అర్ర బతుకమ్మ. ఈ రోజున బతుకమ్మ పండుగనువ జరుపుకోరు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున బతుకమ్మను తయారుచేసి స్త్రీలు అందంగా ముస్తాబయి బతుకమ్మను ఆడుతారు. ఈరోజు అమ్మవారికి సత్తుపిండి, నువ్వుల పిండి, బియ్యం పిండితో తయారు చేసిన లడ్డూలు, పెరుగన్నం, పులిహోర నైవేద్యంగా తయారు చేసి పెడతారు. ఈరోజు బతుకమ్మను ఆడి చెరువులో నిమజ్జనం చేస్తారు.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న వెనుక కేసీఆర్‌…పార్టీ పేరుతో స్కెచ్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu