
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిన్న చాలా గ్రాండ్ గా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. CM Revanth Reddy
congress leaders not wishes CM Revanth Reddy
అయితే రేవంత్ రెడ్డి పుట్టినరోజున మరోసారి ఆయనకు అవమానం జరిగింది. గత సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలపలేదు. ఈసారి కూడా అదే తరహాలో రాహుల్ గాంధీ వ్యవహరించారు. రాహుల్ గాంధీ ఒక్కరే కాదు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కూడా ఈ సారి పుట్టినరోజు శుభాకాంక్షలు రేవంత్ రెడ్డికి చెప్పలేదని వార్త వైరల్ గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. CM Revanth Reddy
Also Read: KTR Wife: లగ్జరీ కారులో కేటీఆర్ భార్య..ఆమె ఆస్తులు ఎంతో తెలుసా ?
అందుకే సోషల్ మీడియా వేదికగా స్పందించలేదని అంటున్నారు. అటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కూడా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారట. అయితే గులాబీ సోషల్ మీడియా మాత్రం కావాలనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఆగ్రనేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పలేదని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కుమారి ఆంటీ సంచలన వీడియో పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కుమారి ఆంటీ వీడియో చేయడం గమనార్హం. CM Revanth Reddy
Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు…రేవంత్ రెడ్డి బెవకూఫ్ అంటూ ?





