

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు ఓ టిడిపి మహిళ అర్థరాత్రి నిప్పు పెట్టింది. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. Jagan
TDP woman leader who set fire Jagan
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఫ్లెక్సీలు అలాగే కటౌట్లు కట్టి సంబరాలు చేసుకున్నారు వైసిపి అభిమానులు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడ కనబడిన కూటమి నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారు. లేటెస్ట్ గా దీనికి సంబంధించిన మరో వీడియో కూడా బయటకు వచ్చింది. Jagan
Also Read: CM Revanth Reddy: రాష్ట్రపతికి ఘోర అవమానం..మరో వివాదంలో సీఎం రేవంత్ ?
అర్ధరాత్రి అందరు పడుకున్న తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు నిప్పు పెట్టింది ఓ టిడిపి మహిళ నేత. అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు నిప్పు పెడుతూ టిడిపి నాయకురాలు నారాయణమ్మ అడ్డంగా దొరికిపోయింది. టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలోని లేపాక్షి మండలం మామిడి ఆకుల పల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు వైసిపి శ్రేణులు బయటపెట్టి, టిడిపిని ఆడుకుంటున్నారు. Jagan
Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?







