

Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు CM రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అభిమానులపై తాజాగా పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అయితే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే పెద్ద వార్త కాకపోయేది. కానీ తెలంగాణలో ఈ సంఘటన జరిగింది. Ys Jagan
CM Revanth Reddy lathi-charges Ys Jagan fans
దీంతో ఈ అంశం వివాదంగా మారింది. డిసెంబర్ 21 అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్గా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ పంజాగుట్ట లో వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరిపారు. అయితే అర్ధరాత్రి అయినా కూడా ఈ వేడుకలు నిర్వహించడం పట్ల తెలంగాణ పోలీసులు సీరియస్ అయ్యారు. Ys Jagan
Also Read: Jagan-Sharmila: జగన్ తో కలిసిపోయిన వైఎస్ షర్మిల..షాకింగ్ ట్వీట్ వైరల్ ?
అర్ధరాత్రి పుట్టిన రోజు వేడుకలు ఏంటి అని అభిమానులపై లాఠీ చార్జ్ జరిపి అదుపులోకి తీసుకున్నారు. వాళ్లందరూ తెలంగాణలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి అభిమానులు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై వైసీపీ సీరియస్ అవుతోంది. చంద్రబాబు చెబితేనే ఇలా జగన్మోహన్ రెడ్డి అభిమానులపై సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. వెంటనే వైసీపీ అభిమానులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. Ys Jagan
Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం







