Toll Gate Free: ఆంధ్ర వాహనాలకు టోల్ గేట్ ఫ్రీ..జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కోస‌మేనా ?

Toll Gate Free

Toll Gate Free: ఆంధ్ర వాళ్లకు అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది రేవంత్ రెడ్డి స‌ర్కార్‌. సంక్రాంతికి ఆంధ్రకు వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలను భరిస్తామని కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ రాయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే, ఆంధ్ర వాహనాలకు రూ. 40 కోట్ల తెలంగాణ ప్రజాధనం ధారాదత్తం చేస్తున్నార‌ని బీఆర్ ఎస్ పార్టీ న్యూస్ వైర‌ల్ చేస్తోంది. హైదరాబాద్ – విజయవాడ ఎన్‌హెచ్ 65 హైవేని దృష్టిలో పెట్టుకొని టోల్ చార్జీల రద్దు ప్రతిపాదన తీసుకొచ్చార‌ని స‌మాచారం. Toll Gate Free

Toll Gate Free Toll gate free for Andhra vehicles

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్ల కోసం సంక్రాంతిని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. దసరాకి బస్సులో డబుల్ చార్జీలు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ సంక్రాంతికి కారులో పోతే టోల్ చార్జీల రద్దుపై తీవ్ర స్థాయిలో గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. తెలంగాణ దసరాకి లేని టోల్ చార్జీ రద్దు ఆంధ్ర సంక్రాంతికి ఎందుకని మండిపడుతున్నారు నెటిజెన్లు. నన్ను కోసుకొని తిన్నా పైసా లేదని బీద మాటలు చెబుతూ, దుబారాకు తెగపడుతున్నట్లు రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడుతున్నారు. Toll Gate Free

Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే, హైవేపై రద్దీ పెరుగుతుందనే సాకుతో ఛార్జీలకు మంగళం పాడార‌ట‌. విజయవాడ హైవేలోని ఒక్క పంతంగి టోల్‌కే రోజుకి రూ. కోటి భరించాల్సి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంద‌ట‌. జనవరి 11 నుంచి 18 వరకు టోల్ చార్జీలు రద్దు చేస్తే, రోజుకి రూ. 5 కోట్ల చొప్పున రూ. 40 కోట్ల ఖర్చు వ‌స్తోంద‌ట‌. Toll Gate Free

Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_