

Congress: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 33 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే తెలంగాణ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పై స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Congress
Congress Merge 6 districts into a single Warangal district
ఆరు జిల్లాలను కలిపి మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు రాజేందర్ రెడ్డి. హనుమకొండ, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలను కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. Congress
Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హరీష్ రావు ?
ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీసి కేసిఆర్ బలి చేశాడని మండిపడ్డారు. వరంగల్ చరిత్ర సెంట్రల్ జైలు అని వ్యాఖ్యానించారు. ఆ సెంట్రల్ జైలు పేరు మార్చి వరంగల్ చరిత్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరంగల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసమే కదా ఆరు జిల్లాలుగా డివైడ్ చేశారు.. ఇప్పుడు కలిపితే ఏం జరుగుతుందని మండిపడుతున్నారు. చిన్న జిల్లాలైతేనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొంటున్నారు. Congress
Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?







