AP New Districts: ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు..5 రెవెన్యూ డివిజన్లు

AP New Districts
AP New Districts
AP New Districts

AP New Districts: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రోసారి జిల్లాల సంఖ్య పెరుగ‌నుంది. చాలా రోజుల నుంచి ఏపీ జిల్లాల సంఖ్య పెంచాల‌నే డిమాండ్లు వస్తున్న త‌రుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాల పెంపు గురించి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు రాగా, కేవలం మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. AP New Districts

Only three more AP New Districts, not six

కొత్తగా మూడు జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది స‌ర్కార్‌. చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 29 జిల్లాలు కానున్నాయి. అలాగే రెవెన్యూ డివిజన్ లో 77 నుంచి 82 కు పెరగబోతున్నాయి. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు అయ్యే జిల్లాకు పేరును ఖరారు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లి, మార్కాపురం అలాగే పోలవరం జిల్లాలో ఏర్పాటు కాబోతున్నాయి. AP New Districts

Also Read: Smriti Mandhana: ప్రియురాలితో లేచిపోయిన పలాష్.. స్మృతి వివాహం ఆగిపోవడం వెనుక షాకింగ్ విషయం..

రంపచోడవరం కేంద్రంగా ఒకే ఒక్క నియోజకవర్గంలో పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం పోలవరం ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం ముంపు ప్రాంతంలో అధిక శాతం చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో ఉంటాయి. పున‌రావాస గ్రామాలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేసేందుకు జిల్లాగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక చంద్ర‌బాబు నాయుడు కూట‌మి స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఏపీ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. AP New Districts

Also Read: KCR: కేసీఆర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఆ మాతం ప‌డిపోయిన నిధులు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu