
Masood Azhar: ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇండియాను ఉద్దేశించి జైషే మహ్మద్ అధ్యక్షుడు మసూద్ అజర్ సంచలన ప్రకటన చేశాడు. ఇండియాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మసూద్ అజర్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, 1000 మంది మానవ బాంబర్లను తయారు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు మసూద్ అజర్. Masood Azhar
Masood Azhar audio viral over ind vs pak
ఇండియాను నాశనం చేసేందుకు వీళ్లను తయారు చేసినట్లు వెల్లడించాడు. ఏ క్షణమైనా ఈ 1,000 మంది మానవ బాంబర్లను ఎటాక్ చేస్తారని హెచ్చరించాడు. దీంతో అతడు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఇండియా అలాగే పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కవింపు చర్యలకు పాల్పడింది. Masood Azhar
Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?
జమ్ము కాశ్మీర్ లోని ఎల్ ఓ సి వెంబడి పాకిస్తాన్ డ్రోన్స్ చెక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన వెంటనే ఏరియల్ సిస్టమ్స్ తో కాల్పులు జరిపింది ఇండియన్ ఆర్మీ. దీంతో పాకిస్తాన్ డ్రోన్స్ అక్కడ నుంచి పారిపోయాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే మళ్ళీ డ్రోన్స్ కలకలం రేపాయి. ఆయుధాలు లేదా డ్రగ్స్ ను పాక్ జార విడిచి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తోంది ఇండియన్ ఆర్మీ. Masood Azhar
Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హరీష్ రావు ?





