

Revanth Reddy: హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కనిపించబోతున్నారు. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్నారు సీఎం రేవంత్. ఈ తరుణంలోనే మొదటి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనత సాధించబోతున్నారు. Revanth Reddy
CM Revanth Reddy as a Harvard student
ప్రపంచంలోని నంబర్ వన్ విద్యాసంస్థలలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో leadership for the 21st century అనే కోర్స్‌కు హాజరుకాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి మొదటి ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ హాజరవుతున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి తరగతులకు హాజరుకాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఇటు ఇవాళ సాయంత్ర దావోస్ వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Revanth Reddy
Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?
అటు ఇవాళ దావోస్ కు సీఎం చంద్రబాబు నాయుడు పయనం కానున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి దావోస్ కు సీఎం చంద్రబాబు వెళతారు. ఈ సందర్భంగా ఐబీఎం, గూగుల్ క్లౌడ్ వంటి కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే దావోస్ చేరుకున్నారు మంత్రి నారా లోకేష్. Revanth Reddy
Also Read: Duvvada Srinivas: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అసలేం జరిగిందంటే?







