Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స‌భ‌లో టీడీపీ పార్టీ జెండాలు ?

Revanth Reddy
Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లాలో ఆదివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి… అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కూడా మాట్లాడారు. Revanth Reddy

TDP party flags in CM Revanth Reddy assembly

అయితే ఈ నేపథ్యంలోనే ఆసక్తికర పరిణామం ఎదుర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ఉండగా కొంతమంది టిడిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలను ఊపుతూ కనిపించారు. వాస్తవంగా ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎక్కువగా ఉంది. ఏపీని ఆనుకొని ఖమ్మం జిల్లా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. దానికి తోడు కమ్మ కులస్తులు ఆ ఖమ్మం జిల్లాలో చాలా మంది ఉంటారు. అందుకే ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఉంది. Revanth Reddy

Also Read: Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?

అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి పని చేశారు. ఈ అభిమానంతో ఖమ్మం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు… సీఎం రేవంత్ రెడ్డి సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలను ఊపుతూ కనిపించారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ పార్టీ సభలో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అని గులాబీ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా కొనసాగింది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన గులాబీ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. Revanth Reddy

Also Read: Duvvada Srinivas: మ‌రో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అస‌లేం జ‌రిగిందంటే?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu