
Telangana: దావోస్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి కొడుకు, సీఎం రమేష్, గ్రీన్‌కో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. దీంతో దావోస్‌లో ఏం జరుగుతోంది? అంటూ గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. Telangana
Telangana CM Ramesh, GreenCo in Davos
రేవంత్ ప్రభుత్వం దావోస్‌లో చేస్తున్న వింత వింత మీటింగుల్లో ఇదొకటి అంటూ ట్రోలింగ్ చేస్తోంది గులాబీ పార్టీ. హైదరాబాదుకే చెందిన గ్రీన్‌కో కంపెనీ ప్రతినిధులతో దావోస్‌లో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశం అయినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదే గ్రీన్‌కో మీద రేవంత్ ప్రభుత్వం ఫార్ములా-ఈ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అంత దూరం పోయి హైదరాబాద్ కంపెనీ ప్రతినిధులను కలవడం ఏ సెటిల్మెంట్ల కోసం అంటూ గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. Telangana
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు షాక్.. కేంద్రానికి సంచలన లేఖ ?
ఈ సమావేశంలో ఆంధ్రాకు చెందిన వివాదాస్పద బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వాచీల స్మగ్లింగ్, భూకబ్జా కేసులో నిందితుడైన మంత్రి పొంగులేటి కొడుకు హర్ష కూడా పాల్గొనడం అంటూ ఫైర్ అవుతోంది గులాబీ పార్టీ. ఇక్కడ చేస్తున్న దందాలు సరిపోవడం లేదని ఇప్పుడు దావోస్ కేంద్రంగా కాంగ్రెస్ మార్క్ దందాలు సాగుతున్నాయి అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? అంటూ ఫైర్ అవుతోంది. Telangana
Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?





