Telangana Districts: తెలంగాణలో రద్దు అయ్యే 16 జిల్లాలు ఇవే ?

Telangana Districts
Telangana Districts
Telangana Districts

Telangana Districts: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునవ్యవస్థీకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాల క్రమబద్దీకరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనల ఆధారంగా కొత్త జిల్లాలు ఉంటాయని సమాచారం. Telangana Districts

Telangana Districts These are the 16 districts to be abolished in Telangana

ఈ మేరకు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మిగిలేది 17 జిల్లాలే అని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో కొత్త జిల్లాలు ఉంటాయని తెలుస్తోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అభ్యంతరాల స్వీకరణ కూడా చేపట్టబోతున్నారట. ఆరు నెలల్లో కమిషన్ నివేదిక ఇస్తుందని సమాచారం. సిరిసిల్ల , సిద్దిపేట, వనపర్తి,, సూర్యాపేట, భద్రాద్రి , ములుగు తదితర జిల్లాలు మొత్తం రద్దు కాబోతున్నాయని సమాచారం. Telangana Districts

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హ‌రీష్ రావు షాక్.. కేంద్రానికి సంచ‌ల‌న లేఖ ?

సగం ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్న యాదాద్రిలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహబూబాబాద్ లోకి భద్రాద్రి విలీనం అవుతుందట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అలాగే మండల కేంద్రాలు అటు సరిహద్దులు, కార్యాలయాలు పూర్తిగా మారబోతున్నాయని అంటున్నారు. ఆ తర్వాత ఉద్యోగ నియామకాల కోసం సరికొత్త జోనల్ సిస్టం ప్రతిపాదించే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. Telangana Districts

Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu