

MP Mallu Ravi : ఏజ్ పై బడినా మరో వివాదంలో చిక్కుకున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కొబ్బరికాయ కొట్టడానికి ఎవడ్రా నువ్వు అంటూ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దాడి చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అలంపూర్ లో తాజాగా ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రావడం జరిగింది. MP Mallu Ravi
MP Mallu Ravi Vs MLA Vijayudu Congress Vs BRS Protocol
ఈ నేపధ్యంలో మల్లు రవి కొబ్బరికాయ కొట్టారు. ఇక ఆ తరువాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించడం జరిగింది. ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు.దీంతో రెచ్చిపోయి ఎవడ్రా నువ్వు అంటూ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడుపై రెచ్చిపోయారు. MP Mallu Ravi
Also Read: Kavitha: కవిత-ప్రశాంత్ కిషోర్ మధ్య 500 కోట్ల డీలింగ్ ?
అనంతరం దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి.. బూతులు తిట్టారు. ఈ తరుణంలోనే మల్లు రవి ఎంపీగా గెలిచినప్పటి నుండి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేటీఆర్ స్పందించారు. విజేయుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. MP Mallu Ravi
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు షాక్.. కేంద్రానికి సంచలన లేఖ ?






