

Kavitha Devanapalli: కెసిఆర్ కూతురు దేవనపల్లి కవిత తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక కార్యక్రమం పై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది దేవనపల్లి కవిత. కెసిఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న కవిత, హరీష్ రావు పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఆయన పనితీరును ఎండగడుతూ.. గులాబీ పార్టీకి దూరమయ్యేలా వ్యవహరిస్తున్నారు. Kavitha Devanapalli
Kavitha Devanapalli contest in Siddipet
అలాంటి కవిత సిద్దిపేట పై కన్నువేసినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారట. తన బావ హరీష్ రావు పై ఎలాగైనా సిద్ధిపేట నియోజకవర్గం లో గెలవాలని ఇప్పటినుంచి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు కు సిద్దిపేట నియోజకవర్గం కంచుకోట అన్న సంగతి తెలిసిందే. గతంలో కేసీఆర్ వరుసగా అక్కడే గెలిచారు. అల్లుడు కోసం సిద్దిపేటను హరీష్ రావుకు ఇవ్వడం జరిగింది కేసీఆర్. అయితే కేసీఆర్ ఇచ్చిన సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా హరీష్ రావు నిలిచారు. Kavitha Devanapalli
Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?
ఈ నేపథ్యంలోనే దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు హరీష్ రావు. అలాంటి సిద్దిపేట నియోజకవర్గంలో కవిత పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రబుల్ షూటర్ హరీష్ రావును కొట్టే మొనగాడు లేడని అంటున్నారు. తలకిందులు తపస్సు చేసిన కూడా, కల్వకుంట్ల కవిత గెలవడం కష్టమే అంటున్నారు. కవితకు అసలు డిపాజిట్లు కూడా రావు అని మరి కొంతమంది చురకలు అంటిస్తున్నారు. Kavitha Devanapalli
Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?







