Kodandaram: కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొద‌లైందంటూ ?

Kodandaram
Kodandaram

Kodandaram: రేవంత్ రెడ్డి స‌ర్కార్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఏర్పాటై, 2 ఏళ్లు పూర్త‌యిన తొలిసారిగా విమ‌ర్శ‌లు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బాంబ్ పేల్చారు. Kodandaram

Kodandaram slams revanth reddy govt

కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం గుస్సా అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సింగరేణిని కార్పొరేట్ వ్యవస్థలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం సరైంది కాదంటూ ఆగ్ర‌హించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు అంతంత ప్రాధాన్యమే ఇచ్చారని నిప్పులు చెరిగారు. Kodandaram

Also Read: TDP: వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద ప‌డేస్తాను

లోకల్ బాడీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలో సీట్ల కేటాయింపుపై చర్చ జరపలేదని మండిప‌డ్డారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా అది కోర్టు పరిధిలో ఉందని తెలిపారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఇలానే జరిగితే మిత్ర పక్షం నుండి బయటకు వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. Kodandaram

Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

Share your love