Thatikonda Rajaiah: తాటికొండ రాజ‌య్య‌కు చెక్‌..స్టేష‌న్ ఘ‌న్ పూర్ బ‌రిలో ఆరూరి ?

Thatikonda Rajaiah
Thatikonda Rajaiah

Thatikonda Rajaiah: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగు షురూ అయింది. గులాబీ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటకు వెళ్లిన నేతలందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆరూరి రమేష్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి, ఎంపీగా పోటీ చేశారు. Thatikonda Rajaiah

big shock to Thatikonda Rajaiah

ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఇప్పుడు సొంత గూటికి వస్తున్నారు ఆరూరి రమేష్. రేపు కెసిఆర్ సమక్షంలో గులాబీ పార్టీ కండువా కప్పు కోల్పోతున్నారట ఆరూరి రమేష్. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి కూడా ఆరూరి రమేష్ రాజీనామా చేసి గులాబీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. Thatikonda Rajaiah

Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?

అయితే ఆరూరి రమేష్ గులాబీ పార్టీలోకి వస్తే తాటికొండ రాజయ్యకు షాక్ తగిలే ప్రమాదం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలో స్టేషన్ ఘనపూర్ ఉప ఎన్నికలు రావడం గ్యారెంటీ అంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆరూరి రమేష్ కు భారీ స్థాయిలో ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన ఆరూరి రమేష్ స్టేషన్ ఘనపూర్ లో అభ్యర్థి అవుతాడని అంటున్నారు. ఇదే జరిగితే తాటికొండ రాజయ్యకు షాక్ తగిలి ప్రమాదం పొంచి ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కాగా ఇప్పటికే తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్యే కాబోతున్నట్లు కేసిఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Thatikonda Rajaiah

Also Read: TDP: వైసీపీ నాయ‌కుల‌తో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద ప‌డేస్తాను

Share your love