

KCR: తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, కరెంటు తీగ కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహం పన్నితే ప్రత్యర్థి చుక్కలు చూడాల్సిందే. ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసులో కూడా కేసీఆర్ అదిరిపోయే స్కెచ్ వేశారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఫోన్ టాపింగ్ కేసులో విచారణ చేపట్టాలని కేసీఆర్ వెల్లడించారు. రూల్స్ ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వాళ్లను ఇంటి దగ్గరే , విచారణ చేయాలని కోర్టు చెబుతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. KCR
KCR Phone Tapping SIT Investigation
కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారులు రెచ్చిపోయి ప్రవర్తించారు. నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ చేస్తామని మొండి పట్టు పట్టారు. అయితే, ఈ నేపథ్యంలో కేసీఆర్ స్కెచ్ వేస్తే, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తడుపుకుంటున్నారు. మీరు ఎక్కడ విచారణ పెట్టిన నేను వస్తా.. పోలీస్ స్టేషన్ కు రమ్మన్న వస్తానంటూ బాలయ్య డైలాగులు ఇచ్చి పడేశారు కేసీఆర్. ఎర్రవలి ఫామ్ హౌస్ లో కేసీఆర్ను విచారిస్తే ఎలాంటి గొడవ ఉండకపోయేది. ఇప్పుడు హైదరాబాద్ దాకా వచ్చి కెసిఆర్ విచారణ ఎదుర్కుంటే సినిమా వేరేలా ఉంటుంది. కెసిఆర్ తో పాటు కేటీఆర్ ను కూడా ఈ ఫోన్ టాపింగ్ కేసులో విచారణ చేశారు. KCR
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబుపై టీడీపీ నాయకుల దాడి ?
ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ పార్టీ నేతలు వాళ్లకు మద్దతుగా హైదరాబాద్కు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తం గులాబీమయం అయింది. ఇప్పుడు గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాద్ వస్తే, విచారణ ఎదుర్కొంటే గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తరలిరావడం గ్యారెంటీ. అదే జరిగితే మళ్లీ కెసిఆర్ ఊపు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విచారణ అయిన తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నాలుగు డైలాగులు వదిలితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఇరుకున పడడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. KCR
Also Read: Etela Rajender: కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరిన ఈటల రాజేందర్ ?







