
Kavitha: కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని కల్వకుంట్ల కవిత అస్సలు వదలడం లేదు. ఏదో ఒక అంశంపై ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. తాజాగా టీ న్యూస్ కు నోటీసులు పంపిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ టాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కవిత. Kavitha
kavitha comments on phone tapping over ktr
రేవంత్ వదిలేసినా, కేటీఆర్ ను నేను వదలను ? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నా భర్త ఫోన్ ట్యాప్ చేయించిండని ఆరోపణలు చేశారు. సిగ్గు లేకుండా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేసి దొంగా చాటుగా వినడానికి సిగ్గు ఉండాలని నిప్పులు చెరిగారు. తెలంగాణ హక్కుల కోసం నేను ఢిల్లీలో కోట్లాడుతుంటే, ఏసీ రూములో కూర్చొని కేసీఆర్ చాటుగా ఉండి పందికొక్కుల నువ్వు ప్రజల సొమ్ము దోచుకోలేదా ? అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత. Kavitha
Also Read: Anchor Shyamala: టాలీవుడ్ యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
కేటీఆర్ నిన్ను రేవంత్ వదిలేసిన నేను వదలను? నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా మీ సంగతీ చూస్తానని హెచ్చరించారు బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత. కాలం నిర్ణయిస్తుంది మీరు చేసిన అక్రమాల మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోతే అయిపోయింది అనుకోకు అంటూ రెచ్చిపోయారు. భవిష్యత్తులో నాకు ఒక రోజు అవకాశం వస్తుంది అప్పుడు 2014 నుండి 2023 వరకు నువ్వు చేసిన భూ బాగోతాలు అన్ని బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. Kavitha
Also Read: PM MODI: మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్..తెలంగాణ ఎంపీల పరువు తీసిన ప్రధాని మోడీ…





