
Minister Narayana : ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిర్మాణాల సమయంలో ఖాళీ స్థలం పన్నును 50 శాతం వరకు తగ్గిస్తున్నట్టు మంత్రి నారాయణ ఇవాళ అసెంబ్లీలో ప్రకటించారు. బిల్డర్లను ప్రోత్సహించడం, నిర్మాణ దశలో వ్యయ భారాన్ని తగ్గించేందుకు ఈ మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేంత వరకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. Minister Narayana
Good news for the people of Andhra Pradesh.. 50 percent discount for all of them
పట్టణ స్థానిక సంస్థల్లో డిస్ ప్లే బోర్డులు, సైన్ బోర్డులు, బస్సులు, ఆటోలపై ప్రకటనలు ప్రదర్శించే సంస్థలు ఇకపై తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఈ మినహాయింపు తో నిర్మాణరంగంలో ప్రోత్సాహం లభిస్తుందని మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. Minister Narayana




















