
Balka Suman : తెలంగాణ మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జూనియర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా.. దాదాపు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్క సుమన్ ఏ1, రాజీరెడ్డి ఏ2, దోమకొండ అనిల్ ఏ4, రామిడి లక్ష్మీకాంత్ ఏ8 గా ఉన్నారు. Balka Suman
బాల్క సుమన్ తో పాటు మరో ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది మేజిస్ట్రేట్. బాల్క సుమన్ ను పరామర్శించేందుకు ఇవాళ ఆదిలాబాద్ కి వెళ్లనున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యంగా బాల్క సుమన్ అరెస్ట్ కి ముందు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో సుమన్ ను అరెస్ట్ చేస్తారనే క్లారిటీ వచ్చేసింది. దీంతో వందలాది మంది కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేసారు.
Also Read : Minister Narayana :ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. వారందరికీ ఏకంగా 50 శాతం డిస్కౌంట్
Balka Suman Arrested 14 Days Raymond
మరోవైపు బాల్క సుమన్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కేటీఆర్, హరీశ్ రావు స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కక్ష పూరితంగా కావాలని బాల్క సుమన్ పై ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Also Read : Rajyasabha elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణ ఎన్ని స్థానాలు ఖాళీ అంటే..?




















