

SWEEPER SALARY : తెలంగాణలో నాలుగో తరగతికి చెందిన సీనియర్ స్వీపర్ నెల జీతం రూ.2లక్షలు ఉందండోయ్.. మీరు విన్నది నిజమే. ఒక సీనియర్ స్వీపర్ జీతం.. ఒక జిల్లా కలెక్టర్ జీతం కంటే కూడా ఎక్కువనే. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్ జీతం రూ.1.5లక్షలు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.లక్షలకు దగ్గరగా ఉండటం విశేషం. ఈ విషయాన్ని ఎవ్వరో కాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. SWEEPER SALARY
IN TELANGANA MONTHLY SALARY OF A SWEEPER IS TWO LAKHS.. MORE THAN SALARY OF A COLLECTOR
తెలంగాణ విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2లక్షల వరకు ఉందని తెలిపారు. ఇలా జీతం ఉండడానికి వరుస పీఆర్సీలే కారణం అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కోసం ప్రతి నెల రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్టు బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్ లో తెలిపారు. 2014లో కేవలం రూ.1500 కోట్లుగా ఉండేదని ఇప్పుడు రూ.6వేల కోట్లు చేరిందన్నారు. విద్యుత్ సంస్థలో పని చేసే చీఫ్ ఇంజినీర్లు నెలకు రూ.7లక్షల వరకు వేతనం అందుకుంటున్నారని తెలిపారు. SWEEPER SALARY
Also Read : DONALD TRUMP : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు..!
ఐఏఎస్ అధికారులు, గవర్నర్ జీతం కంటే కూడా ఎక్కువనేనని తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకొకసారి వేతన సవరణల వల్లనే విద్యుత్ శాఖలో జీతాలు ఈ స్థాయిలో ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 30 సంవత్సరాల సర్వీస్ న్న సీనియర్ క్లాస్ 4 ఉద్యోగులు దాదాపు రూ.2లక్సల వరకు జీతం చెల్లించాల్సి వస్తుందని.. మున్సిపాలిటీలో కొత్తగా చేరిన వారికి రూ.28వేలు ఇస్తే.. 30 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు రూ.లక్షకు పైగా జీతం పొందుతున్నారని చెప్పారు. SWEEPER SALARY
Also Read : INTER EXAMS 2026 : సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. టెన్షన్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు..!







