INTER EXAMS 2026 : సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. టెన్ష‌న్ లో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు..!



INTER EXAMS 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 25 న ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే తొలిరోజు ప‌రీక్ష కేంద్రాల్లో అక్క‌డ‌క్క‌డ ప‌లు స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. మొద‌టి రోజు రెండో భాష పేప‌ర్ 1 కి సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అర‌బిక్ పేప‌ర్ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు హాజ‌రై విద్యార్థుల‌కు ఒక పేప‌ర్ కి బ‌దులు మ‌రో పేప‌ర్ ఘ‌ట‌నలు వెలుగులోకి వ‌చ్చాయి. INTER EXAMS 2026

HINDI QUESTION PAPER INSTEAD OF SANSKRIT

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, హ‌న్మ‌కొండ జిల్లాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగులోకి రావ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు వాళ్ల పిల్ల‌లు ప‌రీక్ష‌లు రాసిన సెంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి నిల‌దీశారు. త‌ల్లిదండ్రులు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కొంత మందికి షోకాజ్ నోటీసులు పంపించారు. త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ ఏంటి..? అని టెన్ష‌న్ ప‌డుతున్నారు విద్యార్థుల త‌ల్లిదండ్రులు.

Also Read : CM REVANTH REDDY : నిన్న స్టూడెంట్.. రేపు స్పీక‌ర్.. దేశంలో ఒకే ఒక్క‌డు..!

ప్ర‌ధానంగా జ‌డ్చ‌ర్ల‌లోని విశ్వ వికాస్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఎంపీసీ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న మ‌నుదీప్ సంస్కృతం భాష‌ను ఎంచుకున్నాడు. అయితే ప‌రీక్ష‌లో అత‌నికి సంస్కృతం కి బ‌దులు హిందీ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఇచ్చారు. చీఫ్ సూప‌రింటెండెంట్ ఆఫీస‌ర్, డిపార్టుమెంట్ ఆఫీస‌ర్ నిర్ల‌క్ష్యంతో పాటు అవ‌గాహ‌న లేని ఇన్విజిలెట‌ర్ వ‌ల్ల ఆ విద్యార్థికి సంస్కృతం కి బ‌దులు హిందీ స‌బ్జెక్ట్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ అందించారు. దీంతో సీఎస్, డీఓల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు షోకాజ్ నోటీసులు అంద‌జేసింది. హ‌న్మ‌కొండ జిల్లాలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : MODI-NETANYAHU : కాషాయం రంగు గురించి నెత‌న్యాహు ఫ‌న్నీ రియాక్ష‌న్..!

Share your love