

SUPREM COURT : జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ (NCERT) 8వ తరగతి సోషల్ స్టడీస్ కొత్త బుక్ లో న్యాయవ్యవస్థ అవినీతి పై ఓ అంశాన్ని చేర్చారు. దీనిపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఈ పాఠ్యాంశం న్యాయ వ్యవస్థ పై దెబ్బ తీసేందుకు చేసిన కుట్ర అని సీజేఐ జస్టీస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. SUPREM COURT
SUPREME COURT IS SERIOUS ABOUT NCERT..CONTROVERSIAL BOOK BANNED
ఈ విచారణ సందర్భంగా సీజేఐ తీవ్రంగా స్పందించారు. మీరు కాల్పులు జరిపారు.. న్యాయ వ్యవస్థ రక్తమోడుతోంది. న్యాయ వ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా గౌరవాన్ని కించ పరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా కనిపిస్తోందని.. ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనస్సులో న్యాయ వ్యవస్థ పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.న్యాయ వ్యవస్థలో అవినీతిని వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించిన NCERT కోర్టుల విశిష్ట చరిత్ను మాత్రం విస్మరించిందని మండిపడ్డారు. జవాబుదారి తనం ఏర్పడేంత వరకు ఈ వ్యవహారాన్ని మేము వదిలిపెట్టబోమని తెలిపారు. కోర్టు 5 ఆదేశాలను జారీ చేసింది. వీటిని అతిక్రమిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామమని హెచ్చరించింది.
Also Read : SWEEPER SALARY : తెలంగాణలో స్వీపర్ నెల జీతం రూ.2లక్షలు.. కలెక్టర్ కంటే ఎక్కువే..!
1.వివాదస్పదమైన 8వ తరగతి సోషల్ పుస్తకానికి సంబంధించి అన్ని హార్డ్ కాపీలను డిజిటల్ వెర్షన్లను తక్షణమే మార్కెట్ నుంచి ఆన్ లైన్ నుంచి తొలగించాలి.
2.ఇప్పటికే పంపిణీ చేసినటువంటి పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ కి ఆదేశం ఇచ్చింది.
3.ఎక్కడైనా ఈ పుస్తకాలు అందుబాటులో ఉంటే ఉపాద్యాయులు వాటిని ఉపయోగించి పాఠాలు బోధించకూడదు.
4.ఈ పుస్తకానికి సంబంధిన ముద్రణ, పంపిణీని నిలిపివేయాలి
5.వివాదస్పద పాఠ్యాంశాన్ని రూపొందించిన నేషనల్ సిలబస్ బోర్డు సభ్యుల పేర్లు, వారి అర్హతలు, ఆ చాప్టర్ ను ఆమోదించిన సమావేశం సంబంధించి మినిట్స్(చర్చా పత్రాలు) కోర్టు ముందు ఉంచాలి.
Also Read : DONALD TRUMP : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు..!
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





