
RAGHURAMA KRISHNA RAJU : ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గాయపడ్డారు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో వేగంగా పరుగెత్తే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఆ సమయంలో శరీరం బ్యాలెన్స్ ఎడమ భుజం పై పడింది. ఈ క్రమంలో మణికట్టు వద్ద గాయం అయింది. RAGHURAMA KRISHNA RAJU
AP DEPUTY SPEAKER RAGURAMA KRISHNA RAJU INJURED WHILE PLAYING CRICKET
భుజం నొప్పి ఉండటంతో రఘు రామ కృష్ణరాజు ని వెంటనే మణిపాల్ ఆసుపత్రి కి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. భుజం నొప్పి ఎక్కువ కావడంతో పాటు చేతి బొటన వేలుకి గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గాయపడ్డారు.
Also Read : SWEEPER SALARY : తెలంగాణలో స్వీపర్ నెల జీతం రూ.2లక్షలు.. కలెక్టర్ కంటే ఎక్కువే..!
తమ జట్టు పై కూతకు వచ్చిన ఎమ్మెల్యే పార్థ సారథి.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను పట్టుకునే ప్రయత్నంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారిపై పడ్డారు. దీంతో పార్థసారధి పాదం, శ్రీ కాంత్ కు భుజం వద్ద కాలర్ బోన్ ప్రాక్చర్ అయినట్టు సమాచారం. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో వీరికి గాయాలైనట్టు గుర్తించారు.
Also Read : SUPREM COURT : NCERT పై సుప్రీంకోర్టు సీరియస్.. వివాదస్పద పుస్తకం బ్యాన్..!
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





